అంతర్జాతీయ విచిత్రాలు(International oddities)

Views

  22. చైనాకు చెందిన జన్పంగ్ , లిన్పింగ్ అన్న యువతులు 1995 నవంబర్ 888 విష సర్పాలున్న గాజు గదిలో , 288 గంటలు నిర్భయంగా గడిపి ' గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు'లో నమోదయ్యారు .

 23. 1976 లో ' ఫ్రిగోరిక్ ' అనే ఓడ ఫ్రాన్స్నుంచి అర్జెంటీనాకు బయలుదేరింది . చార్లెస్ టెలియర్ అనే రూపశిల్పి ఆ నౌకలో రిఫ్రిజిరేషన్ యంత్రాలు అమర్చాడు . ఆ ప్రయాణానికి 105 రోజులు పట్టినా మాంసం చెడిపోకుండా వుంది శీతలీకరించిన ఆహారపదార్థాలను పంపించిన తొలి నౌక అదే ! *

24 .ప్రపంచంలోని అతిపెద్ద అక్వేరియం ఫ్లోరిడాలోని అర్లాండోలో డిస్నీవరల్డ్ వుంది . అందులో రెండుకోట్ల ఎనిమిది లక్షల లీటర్ల నీరు పడుతుంది . * 

 25. మొట్టమొదటి సర్కస్ ప్రదర్శనను క్రీ.శ. 1769 లో ఫిలిప్ ఆస్లే అనే మహాశయుడు ఏర్పాటు చేశాడు . ఆ సర్కస్లో ఒకే ఒక్క బఫూన్ , కొన్ని గుర్రాలు , ఒక కోతి మాత్రమే పాల్గొన్నాయి . *

 26. టార్జాన్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ అలరిస్తాయి . టార్జాన్ పెట్టే కేక ఒళ్ళు జలదరింప చేసేదిలా వుంటుంది . అయితే ఆ కేక ఒక్కరి కంఠస్వరం కాదట . ముగ్గురు వ్యక్తుల అరుపుల్ని సమ్మిళితంచేసి , జానీ వెయిస్ ముల్లర్ అన్న నటుడు సృష్టించాడట !

 27. కాలినడకతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన ఘనత మహిళల్లో బ్రిటన్కు చెందిన ' ఫ్యోనా క్యాంప్బెల్'కు దక్కుతుంది . ఆమె పదకొండేళ్ళపాటు శ్రమించి ఈ రికార్డును నెలకొల్పారు .

 28. నలందాకు చెందిన ప్రఖ్యాత బౌద్ధ పండితుడు శాంతా రక్షితే , హిమాలయాలు దాటి టిబెట్ వెళ్ళి బౌద్ధమత వ్యాప్తికి విశేష కృషి చేశారు . టిబెట్ వెళ్ళేటప్పుడు . ఆయన వయస్సు 75 ఏళ్ళ పైమాటే ! 

29. లండన్కు చెందిన జాన్ రాబర్ట్సన్ అనే వ్యాపారి ఓ సినిమాలో వాడిన కారును చూసి ముచ్చటపడి రాబోట్కారును తయారు చేసుకున్నాడు . 

* 30 . మాక్స్ ముల్లర్ సంస్కృత పండితుడు . ఆయనెప్పుడూ ఇండియాని సందర్శించలేదు . మనదేశానికి చెందిన ఓ అభిమాని ఆక్స్ఫర్డులోని ఆయన యింటికి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడగా , ఆయనకు ఒక్కముక్కయినా అర్థం కాలేదట ! ఆ అభిమానికి మతిపోయినట్టయింది . *


31. చైనా నేత “ మావో ఎన్నడూ పళ్ళు తోముకొనేవాడు కాదట ! ' పులి ' ఎప్పుడైనా దంతధావనం చేసుకుంటుందా ? ” అని ప్రశ్నించేవాడట మావో ! . 

32 . 1915 లో ' ఇంగ్లాండ్ ' ప్రధాని డేవిడాయ్డ్ జార్జి యిలా ప్రకటించారట ! మనం జర్మనీతో , ఆస్ట్రేలియతో , మద్యంతో పోరాడుతున్నాము . అయితే , మనకు ప్రధాన శత్రువు ' మద్యం ' అని ప్రకటించారు ! 

* 33. మధ్యయుగాల్లో ' ఐరోపా ' న్యాయమూర్తులు ముద్దాయిలకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించేవారు . నోటినిండా పిండి కూరి నిందితుణ్ని మింగమనేవారు . అబద్ధమాడటంవల్ల భయపడుతూ వుంటే పిండి మింగడానికి సరిపడే లాలాజలం నోటిలో ఊరదన్న ప్రాతిపదికపై ఇలా చేసేవారు ! 

* 34. ఈజిప్టునకు చెందిన క్లియోపాత్రా రాణి అందంగా కనిపించాలని తాపత్రయ పడేవారు . ఆ రాణీగారు తన బుగ్గలకు ఎర్ర రంగుపొడి , కనురెప్పలకు నీలం రంగు , కంటికింద భాగానికి ఆకుపచ్చ రంగుల్ని అడ్డుకొనేవారట !

 * 35. ' ఆక్విడక్ట్ ' అంటే నీటిని మళ్ళించడానికి నిర్మించే అందమయిన కట్టడాలు . అలాంటివాటిని రోమన్లు స్పెయిన్ లో నిర్మించారు .

 36. అజోర్స్లోని నావో మికిల్ దీవిలో నివసించేవారికి మామూలు పొయ్యి అవసరం లేదు . ఏదయినా వండాలనుకొంటే ఆ పదార్థాలను బట్టలో చుడతారు . ఫర్నాస్ కొలను సమీపంలో నేలను తవ్వి అక్కడ పూడ్చి పెడతారు . తొమ్మిది , పది గంటల్లో మాంసం , కూరగాయలు సైతం ఉడికిపోతాయి . ఆ పరిసరాలు 208 ఫారన్హీ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతవల్ల పొయ్యిమీద ఉడికినట్టు వంటకాలు పక్వమవుతాయి .

 37. అమెరికాకు చెందిన హారోడ్ బ్లాంక్కు 1972 నాటి మోడల్ డాడ్జ్ వ్యాన్ ఒకటుంది . ఆ వ్యాన్ చుట్టూ 1,705 కెమెరాలతో ఆశ్చర్యగొల్పేలా వుంటుంది . కొన్ని కెమెరాలను ఆకర్షణకోసం , మరికొన్నిటిని చకచకా ఫోటోలు తీయడం కోసం ఆ వ్యాను చుట్టూ అమర్చారు . 

* 38. అమెరికా , ఇంగ్లాండు , జర్మనీ వంటి దేశాల్లో పోలీసు శాఖలో కూడా డాగ్ స్క్వాడ్ లు ముఖ్య స్థానం వహించాయి . నేరాలను పసిగట్టడంలో కీలకపాత్ర వహిస్తున్న శునకాలను ఆ దేశాలు బాగా ఉపయోగించుకుంటున్నాయి . అక్కడ పోలీసు కుక్కల నేర్పును తెలిపే అనేక వ్యాసాలు కూడా దర్శనమిస్తున్నాయి .

 39. ' ' సింగపూర్'లో హోటళ్ళు , రైల్వేస్టేషనులు , బస్ స్టాండ్లు మొదలయినచోట్ల పోస్టేజీ స్టాంపులు అమ్మే ఆటోమాటిక్ యంత్రాలున్నాయి !

40. వాషింగ్టన్ నేలమీద , నీటిమీదకూడా నడిచే వాహనాల ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తుంటారు !

 * 41 . రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన మందుపాతర్ల తాలూకు పాత్రలతో బ్రిటను చెందిన ' రేటేలర్ ' అను వ్యక్తి యిప్పుడు పాత తుక్కు కింద విక్రయాన్ని సాగిస్తున్నాడు ! . 

42. జపాన్ సెంట్రల్ రైల్వే కంపెనీ ఇటీవల గంటకు 421 కి॥మీ || ప్రయాణించగల సూపర్ కండక్టింగ్ మాగ్నటికల్లీ లెవిటేడెడ్ లీనియర్ మోటార్ ట్రయిన్ ( రైలు ) అనే వాహనాన్ని ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించారు ! 

43. జపాన్ చూయింగ్డమ్ అసోసియేషన్వారు గత నాలుగేళ్ళుగా జూన్ ఒకటో తేదీన “ చూయింగ్ గమ్ " దినంగా పాటిస్తున్నారు .

 * 44 . జపాన్ కు చెందిన నిప్పన్ విమానసంస్థ , విమానం ముందు భాగానికి రెండుపక్కలా పెద్ద పెద్ద కళ్ళబొమ్మల్ని పెయింట్ చేసి విమానాలు కూడా పక్షుల్లా కనిపించే చర్యలు తీసుకుంది . దీనివలన ఆకాశంలో ఎగిరే పక్షులు వాటికి అడ్డురాకుండా వుంటాయని వారి ఆలోచన ! 

* 45. ఆస్ట్రేలియా సమీపంలోని ఫాల్కనీవి 1913 లో సముద్ర గర్భంలో మునిగి పోయింది . పదమూడేళ్ళ అనంతరం అది పైకి తేలింది . ఇరవయి మూడేళ్ళ తర్వాత 1952 లో మళ్ళీ సముద్రంలో కలిసిపోయింది . . 

46 . " జర్మనీ ” లో ఏటా దాదాపు ఆరువందల మంది నిద్రలో మంచి మీద నుంచి కిందకు దొర్లి మరణిస్తారని ఓ సర్వేలో వెల్లడయింది .

 * 47. క్రీస్తుశకం 1066 లో నార్మన్ యుద్ధానికి సంబంధించిన 72 దృశ్యాలు గల చిత్ర కదంబం ఇంగ్లండులో వుంది . ఎనిమిది రంగుల ఊలు దారాలతో ఇది ఎంబ్రాయిడరీ చేయబడింది ! .

 48. జపానక్కు చెందిన తనగుచీ అని వికలాంగునికి రెండు కాళ్ళూ లేవు . కానీ అతను అందరిలాగే యేదో ఒక సాహసకృత్యం చేయడానికి కృషి చేశాడు . వీల్ఛెయిర్లో 360 కి॥మి || ప్రయాణించి రికార్డు సృష్టించాడు 

. 49. ఫ్రాన్స్లో గొప్ప నటీమణిగా కీర్తిపొందిన సారా బెర్నహార్డ్ జీవితాన్ని గురించికంటే , మృత్యువును గురించి యెక్కువగా ఆలోచిస్తూ వుండేది ! అందరూ పార్కులకూ , పిక్నికలకు వెళ్తుంటే ఆమె స్మశానాలకు షికారుగా వెళుతుండేదట ! 

50. పిల్లలకోసం ప్రత్యేకించి పుస్తకాన్ని లండనికి చెందిన “ అలెగ్జాండర్ లేసీ ” 1563 లో తొలిసారి ప్రచురించాడట ! ఆ పుస్తకం ఎనిమిది పేజీలు గలది .


Post a Comment

Previous Post Next Post